సీకే బాబు ఇంటికి వెళ్లిన పురందేశ్వరి

  • సీకే బాబుతో పురందేశ్వరి మంతనాలు
  • భేటీ వెనుక రాజకీయ కోణం లేదని చెప్పిన పురందేశ్వరి
  • తమ మధ్య ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందన్న బీజేపీ నాయకురాలు
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు నివాసానికి కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెళ్లారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ సీకే బాబుతో తమకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని... తమ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని ఆమె తెలిపారు. మరోవైపు, సీకే బాబును బీజేపీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని... ఈ నేపథ్యంలోనే, ఆయనతో పురందేశ్వరి భేటీ అయ్యారని కొందరు చెబుతున్నారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసే క్రమంలో, పలువురు నేతలను బీజేపీలోకి తీసుకునే ప్రయత్నంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నారు. 
Go Back to Shorts
ck babu
chittor
purandeswari
bjp

More Telugu News